పర్వతగిరిలో అటల్ బిహారీ వాజ్‌పేయి జన్మదిన వేడుకలు
WGL: పర్వతగిరి మండలం చింత నెక్కొండలో భారతరత్న, మాజీ భారత ప్రధానమంత్రి శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి జన్మదిన వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి గ్రామస్థులు పూలమాల వేసి నివాళులర్పించారు. దార్శనిక నాయకుడిగా, సుపరిపాలన సంస్కరణలకు ఆద్యుడిగా ఆయన అందించిన సేవలను వక్తలు స్మరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ శ్రేణులు పాల్గొన్నారు.