పాలవలసలో రేపటి నుండి సంబరాలు

SKLM: సోంపేట మండలం పాలవలసలో నవరాత్రుల సంబరాలు. మే 12 సోమవారం నుండి 20 మంగళవారం వరకు గ్రామదేవత శ్రీ రౌతుపోలమ్మ సంబరాలు జరగనున్నాయి. 20 ఏళ్ళ తరువాత జరుగుతున్న సంబరాలకు వివిధ ప్రాంతాలలో ఉన్న గ్రామస్తులు గ్రామానికి చేరుకుంటున్నారు. వివిధ కళాకారులతో సాంస్కృతిక వీది నాటకాలను తిలకించడానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నారు.