మైనర్ బాలిక అదృశ్యం.. కేసు నమోదు

CTR: పుంగనూరు మండలం మార్లపల్లి గ్రామానికి చెందిన సుబ్రహ్మణ్యం కుమార్తె శనివారం ఉదయం 5 గంటలకు ఇంటిలో నుంచి వెళ్లి ఇంటికి తిరిగి రాలేదు. చుట్టుపక్కల బంధువుల ఇంట్లో గాలించిన ఫలితం లేకపోవడంతో బాలిక తండ్రి పోలీసులను ఆశ్రయించాడు. అనంతరం ఈ ఘటనపై మైనర్ బాలిక అదృశ్యమైనట్లు కేసు నమోదు చేసినట్లు ఎస్సై అశ్వత్థ నారాయణ తెలిపారు.