'పశు వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి'

VZM: పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పశువైద్య శిబిరాలని ప్రతి ఒక్క పాడి రైతు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు అన్నారు. జాతీయ పశు వ్యాధుల నివారణ కార్యక్రమంలో భాగంగా సోమవారం చీపురుపల్లి క్యాంపు కార్యాలయంలో నెల రోజులు పాటు నిర్వహించనున్న పశువైద్య శిబిరాల గోడ పత్రికను ఆయన ఆవిష్కరించారు.