ఈనెల 9న పామిడిలో ఉచిత కంటి వైద్య శిబిరం
ATP: పామిడి పట్టణంలోని భావసార క్షత్రియ కళ్యాణమండపంలో ఈనెల 9న ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు డాక్టర్ తిరుపతి నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆదివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఈ ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. మండల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.