బీజేపీ నాయకుల ముందస్తు అరెస్టులు

NGKL: బల్మూరు మండలం సీతారాంపురం –తోడేళ్ల గడ్డ రహదారి కోసం ధర్నాకు పిలుపునిచ్చిన నేపథ్యంలో శుక్రవారం బీజేపీ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. ప్రభుత్వం ప్రజల సమస్యలను పట్టించుకోకుండా రాజకీయ ప్రయోజనాల కోసం ఇలాంటి చర్యలు తీసుకుంటోందని నాయకులు విమర్శించారు. వెంటనే రహదారి మంజూరు చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.