పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించిన కమిషనర్

GNTR: పొన్నూరు పట్టణంలోని రైల్వేస్టేషన్ రోడ్డులో శనివారం ప్రధాన పైపులైన్‌ల మరమ్మతులు చేపట్టారు. మున్సిపల్ కమిషనర్ ముప్పాళ్ళ రమేష్ బాబు పనులను పర్యవేక్షించారు. నీరు వృధాగా పోకుండా చర్యలు చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు. పైపులైన్ ద్వారా నీరు వృధాగా పోతూ రోడ్డుపైకి వచ్చి ప్రయాణానికి ఆటంకంగా మారిందని వచ్చిన ఫిర్యాదు మేరకు చర్యలు చేపట్టినట్లు కమిషనర్ తెలిపారు.