రేపటికి ముగియనున్న గడువు

కృష్ణా: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో Y21-Y24 బ్యాచ్‌లకు సంబంధించి ఎం.ఫార్మసీ 2వ సెమిస్టర్ రెగ్యులర్, 1వ సెమిస్టర్ సప్లిమెంటరీ థియరీ పరీక్షల షెడ్యూల్ ఇటీవల విడుదలైంది. ఈ పరీక్షలు AUG 29 నుంచి నిర్వహిస్తామని, పరీక్షలు రాసే విద్యార్థులు ఎలాంటి ఫైన్ లేకుండా ఈనెల 18లోపు ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించాలని ANU పరీక్షల విభాగం సూచించింది.