INSPIRATION: జీఎంసీ బాలయోగి

INSPIRATION: జీఎంసీ బాలయోగి

భారత రాజకీయాల్లో గంటి మోహనచంద్ర (జీఎంసీ) బాలయోగి విశిష్టమైన వ్యక్తి. తొలి దళిత లోక్‌సభ స్పీకర్‌గా చరిత్ర సృష్టించారు. 1998-2002 వరకు నిష్పక్షపాతంగా సభా కార్యక్రమాలను నిర్వహించి అందరి ప్రశంసలు పొందారు. ఏపీలోని కోనసీమ ప్రాంతానికి చెందిన బాలయోగి చిన్న వయసులోనే అత్యున్నత పదవిని అధిష్టించారు. 2002లో జరిగిన ఒక విమాన ప్రమాదంలో ఆయన అకాల మరణం చెందడం దేశానికి తీరని లోటు.