భారీగా రేషన్ బియ్యం పట్టివేత
BDK: ఇల్లంద, టేకులపల్లి మండలంల్లో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇల్లందు (మ) రేపల్లెవాడలోని జామాయిల్ తోట వద్ద వాహనాల్లో తరలించేందుకు సిద్ధంగా ఉన్న 200 క్వింటాళ్ల బియ్యాన్ని పట్టుకున్నారు. అలాగే టేకులపల్లి(మ) లాలూతండా సమీపంలో లారీలో తరలించేందుకు సిద్ధంగా ఉన్న 250 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.