'అత్యవసర పరిస్థితుల్లో కాల్ సెంటర్‌ను సంప్రదించాలి'

KMR: అత్యవసర పరిస్థితుల్లో నంబర్ 08468-220069ను సంప్రదించాలని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఒక ప్రకటనలో సూచించారు. వరదలు తగ్గుముఖం పట్టే వరకు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. పశువులు, గొర్రెలను వాగుల వద్దకు తీసుకెళ్లొద్దన్నారు. విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని సూచించారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదని హెచ్చరించారు.