'మైపాడు బీచ్‌ను అభివృద్ధి చేయండి'
NLR: రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అమరావతిలో మర్యాదపూర్వకంగా కలిశారు. నెల్లూరు జిల్లాకు తలమాణికమైన మైపాడు బీచ్‌ను సమగ్రంగా అభివృద్ధి చేయాలని కోరారు. ఎమ్మెల్యే వినతిపై మంత్రి సానుకూలంగా స్పందించారు. మైపాడు బీచ్ అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని తెలిపారు.