తుఫాను బాధితుల పరామర్శకు మాజీ మంత్రి
W.G: మాజీ మంత్రి చెరుకువాడ రంగనాథ రాజు బుధవారం పెనుమంట్ర మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించి, తుఫాన్ వల్ల నీట మునిగిన వరిపొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన రైతులతో మాట్లాడి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్శనలో ఆయన వెంట స్థానిక వైసీపీ నేతలు పాల్గొన్నారు.