గ్రామీణ యువత ప్రతిభను వెలికితిసేందుకే సీఎం కప్

WGL: వరంగల్ గ్రామీణ ప్రాంతాల్లోని యువత క్రీడా ప్రతిభను గుర్తించి వారిని ప్రోత్సహించి ఒలింపిక్స్‌లో పథకాలు సాధించాలనే లక్ష్యంతో సీఎం కప్‌ను నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర అటవీ పర్యావరణ దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. మంగళవారం వరంగల్ సిటీ స్టేడియంలో సీఎం కప్ జిల్లా స్థాయి పోటీలను మంత్రి కొండా సురేఖ వర్చువల్‌గా ప్రారంభించారు.