నేడే లాస్ట్ డేట్

నేడే లాస్ట్ డేట్

KNR: మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు తమ ఎన్నికల ఖర్చుల వివరాలను సమర్పించేందుకు గడువు నేటితో ముగియనుంది. అభ్యర్థులు ఇవాళ సాయంత్రంలోపు మున్సిపల్ కార్యాలయంలో ఖర్చుల వివరాలు సమర్పించాలన్నారు. సమర్పించని పక్షంలో భవిష్యత్తులో ఎన్నికల్లో పోటీ చేసే అర్హత కోల్పోవాల్సి ఉంటుందని తెలిపారు. గెలిచిన అభ్యర్థులు కూడా తమ పదవులను కోల్పోయే అవకాశం ఉండటంతో వివరాలు అందజేయాలని పేర్కొన్నారు.