రైల్వే ప్లాట్ ఫామ్ తక్షణమే నిర్మించాలి: CPI

MHBD: కేంద్రంలో కొత్త బజార్ వైపు రైల్వే ప్లాట్ ఫామ్ తక్షణమే నిర్మించాలని కోరుతూ స్థానిక భగత్ సింగ్ విగ్రహం దగ్గర సీపీఐ కార్యకర్తలు బుధవారం భారీ ధర్నా నిర్వహించారు. జిల్లా కేంద్రంలో కార్యకర్తలు ర్యాలీ తీశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అజయ్ సారధి రెడ్డి, పెరుగు కుమార్, దేశ పల్లి నవీన్ తదితరులు పాల్గొన్నారు.