పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి

AKP: పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం ద్వారా ఆరోగ్యంగా ఉండగలుగుతామని ఎంపీడీవో కాశీ విశ్వనాథరావు అన్నారు. శనివారం బాపిరాజు కొత్తపల్లి గ్రామంలో స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ పెట్ల లింగన్నాయుడుతో కలిసి చెత్త నుండి సంపద తయారీ కేంద్రాన్ని పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం గ్రామంలో పలు రకాల మొక్కలు నాటారు.