ఈ- పంట నమోదు పూర్తి చేశాం: ఏవో

ఈ- పంట నమోదు పూర్తి చేశాం: ఏవో

W.G: వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ- పంట నమోదు ప్రక్రియ పూర్తయ్యిందని ఏవో ఏ. జ్యోషిలా ఇవాళ తెలిపారు. నరసాపురం మండలంలో 12 రైతు సేవా కేంద్రాల ద్వారా 9,302 ఎకరాల పంట నమోదు చేశామన్నారు. ఇందుకు సంబందించి 7,725 మంది రైతుల ఈ- కేవైసీ వేలిముద్రల సేకరణ పక్రియ ఈ నెల 14లోగా పూర్తవుతుందన్నారు. రైతు సేవా కేంద్రాల్లో ఈ పంట నమోదు జాబితాలను పొందుపరిచామన్నారు.