లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు

JGL: జిల్లాలోని ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి బుధవారం రూ. 1,89,167 ఆదాయం లభించింది. ఆలయ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, వివిధ కార్యక్రమాల టికెట్ల ద్వారా రూ. 1,19,810, ప్రసాదాల ద్వారా రూ. 38,000, అన్నదానం ద్వారా రూ. 31,357 ఆదాయం వచ్చిందని ఆలయ అధికారి సంకటాల శ్రీనివాస్ తెలిపారు అన్నారు.