VIDEO: ప్రజావాణిలో మాజీ సర్పంచ్ వినూత్న నిరసన
KNR: జిల్లా కలెక్టరేట్లో సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో సుందరగిరి మాజీ సర్పంచ్ వంతడుపుల వెంకటస్వామి డప్పు కొడుతూ నిరసన తెలిపారు. పేదల సమస్యలు ఏళ్లుగా పరిష్కారం కావడం లేదని, అధికారుల నిర్లక్ష్యం కారణంగా బాధితులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోందని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి అర్జీలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.