రెవిన్యూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చేస్తాం: మంత్రి
అన్నమయ్య: మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చిన్నమండెం బోరెడ్డిగారిపల్లిలో ఇవాళ ప్రజాదర్బార్ నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల వినతిపత్రాలను స్వీకరించి, తక్షణ పరిష్కారం కోసం అధికారులను ఆదేశించారు. పలు రెవిన్యూ సమస్యలకు ప్రత్యక్షంగా పరిష్కారం చూపారు. కూటమి ప్రభుత్వం రెవిన్యూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా కృషి చేస్తోందని మంత్రి తెలిపారు.