ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్ట్
అన్నమయ్య: సానిపాయ అటవీ పరిధిలో శుక్రవారం తెల్లవారుజామున టాస్క్ ఫోర్స్ పోలీసులు కూంబింగ్ నిర్వహించి ఎనిమిది మంది ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్టు చేశారు. రాయవరం సెక్షన్ వద్ద పారిపోవడానికి ప్రయత్నించిన స్మగ్లర్లను వెంబడించి అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 12 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.