విజయవంతంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం
కృష్ణా: మెడికల్ కాలేజీల ప్రైవేటీకలకు వ్యతిరేకంగా మచిలీపట్నంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం మంగళవారం చేపట్టారు. ఈ సందర్భంగా మచిలీపట్నం వైసీపీ ఇంఛార్జ్ పేర్ని కృష్ణమూర్తి మాట్లాడుతూ.. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వల్ల పేద, మధ్యతరగతి విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారని అన్నారు. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీపీపీ నినాదాన్ని అంగీకరించబోమని స్పష్టం చేశారు.