'ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు'
KMM: ఎర్రుపాలెం మండలంలోని పలు క్రిటికల్ పోలింగ్ స్టేషన్లను బుధవారం వైరా ఇన్‌ఛార్జ్ ఏసీపీ వసుంధర యాదవ్ సందర్శించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా ప్రతి ఒక్కరు సమన్వయం పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగే కార్యక్రమాలు చేయకుండా పోలీసులకు సహకరించాలన్నారు.