అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని వినతి
ELR: అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్లు తమ సమస్యలను పరిష్కరించాలంటూ పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజుకి ఇవాళ వినతిపత్రం అందజేశారు. 2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు తమ వేతనాల్లో ఎలాంటి పెంపు జరగలేదని, వేతనాలు పెంచాలని కోరారు. వేసవికాలం కావడంతో అంగన్వాడీలకు సెలవులు ప్రకటించాలని వినతిలో పేర్కొన్నారు. పలు సమస్యలను పరిష్కరించాలన్నారు