సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాను: మోహన్‌రావు

అనకాపల్లి: మాకవరపాలెం మండల తహసిల్దార్‌గా బి.మురళీ మోహన్‌రావు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలో రెవెన్యూ పరమైన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. అనంతరం రెవెన్యూ ఉద్యోగులు ఆయనకు పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. కాగా, ఇప్పటివరకు ఇక్కడ తహసిల్దార్‌గా పనిచేసిన ప్రసాదరావు శ్రీకాకుళం జిల్లాకు బదిలీ అయ్యారు.