తెగుళ్లపై రైతులకు అవగాహన

జగిత్యాల: వెల్గటూర్ మండలంలోని కిషన్‌రావు గ్రామంలో జగిత్యాల జిల్లా వ్యవసాయ అధికారి బి. వాణీ క్షేత్ర పర్యటన చేశారు. రైతులకు పంటలకు వచ్చే తెగుళ్లు, నేల ద్వారా వచ్చే తెగుళ్లపై అవగాహన ఆమె కల్పించారు. ముఖ్యంగా వరి నారు మడి దశలో వచ్చే తెగులు, చీడ పీడల యాజమాన్య పద్ధతులు రైతులకు వివరించారు. అలాగే పత్తి, పసుపు, జనుము, జీలుగ పంటలను పరిశీలించారు.