చెరుకుపల్లి శివాలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు

చెరుకుపల్లి శివాలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు

NLG: కేతపల్లి మండలం చెరుకుపల్లి గ్రామంలోని శివాలయంలో ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వేదమంత్రాల నడుమ పూజా కార్యక్రమాలు నిర్వహించగా, ఎమ్మెల్యే స్వామివారికి అభిషేకం, అర్చనలు చేశారు. శివరాత్రి పర్వదినం ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందించేదని, గ్రామ ప్రజలు ఐక్యంగా పాల్గొని భక్తిశ్రద్ధలతో ఈ ఉత్సవాన్ని జరుపుకోవాలన్నారు.