బస్సులో ప్రయాణించిన కలెక్టర్
నెల్లూరు ఆర్టీసీ బస్టాండ్‌లో ఇవాళ 'దివ్యాంగ శక్తి' పథకాన్ని ఆర్టీసీ రీజనల్ ఛైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ హిమాన్షు శుక్ల, మేయర్ సుజాత దివ్యాంగులతో కలిసి ప్రయాణించారు. దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించే ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.