'కట్టలను ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి'
JN: పాలకుర్తి మండల కేంద్రంలోని కుంటల భూములు ఆక్రమించుకునేందుకు కొందరు ప్రయత్నాలు చేస్తున్నారని మత్స్య పారిశ్రామిక సహకార సంఘం సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. మైదాకు కుంట శంకరదేవి కుంట, కోనమ్మకుంట, ఎర్రమల్లయ్య కుంటలను ఇవాళ సందర్శించారు. కుంట కట్టలను ధ్వంసం చేసిన వారిపై చట్టపరమైన చర్యలను తీసుకోవాలని అధికారులను కోరారు.