ఆటో బోల్తా.. ఇద్దరికి గాయాలు

ఆటో బోల్తా.. ఇద్దరికి గాయాలు

GNTR: తుళ్లూరు మండలం పెదపరిమి శివారులో బుధవారం ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల మేరకు.. పెదపరిమి వైపు నుంచి నీరుకొండ వైపు వెళ్తున్న ఆటో బ్రేక్ వేయడంతో అదుపుతప్పి పంట కాలువలోకి దూసుకెళ్లి బోల్తా కొట్టింది. ఆటోలో ఉన్న ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.