పంట పొలాల్లోకి దూసుకెళ్లిన స్కూల్ బస్సు
W.G: యలమంచిలి మండలం కలగంపూడి గ్రామంలోని ఓ స్కూల్‌కు చెందిన బస్సు అదుపు తప్పి ఇవాళ ఉదయం పంటపొల్లాలోకి దూసుకెళ్లింది. డ్రైవర్ బస్సును పార్కింగ్ చేయడానికి తీసుకెళ్లే క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్లు స్కూల్ మేనేజ్మెంట్ తెలిపింది. ఆ సమయంలో బస్సులో విద్యార్థులు ఎవరూ లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది.