నేటి నుంచి పశువులకు గాలికుంటు టీకాలు

నేటి నుంచి పశువులకు గాలికుంటు టీకాలు

NGKL: వంగూర్ మండలంలోని పాడి పశువుల రైతులకు బుధవారం నుంచి మే 14 వరకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు ఇవ్వనున్నట్లు మండల పశు వైద్య శాఖ అధికారి చందు తెలిపారు. గ్రామాల్లో రైతులు కనీసం 50 పశువులను టీకాలకు సిద్ధంగా ఉంచితే గ్రామాల్లోకి వచ్చి ఉచితంగా టీకాలు వేస్తామని వెల్లడించారు. రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.