నేడు కల్లూరు మండలంలో ఎమ్మెల్యే పర్యటన
KMM: కల్లూరు మండలంలో శనివారం ఎమ్మెల్యే మట్ట రాగమయి పర్యటించనున్నట్లు క్యాంపు కార్యాలయ సిబ్బంది ఓ ప్రకటనలో తెలిపారు. ముచ్చవరం, ఓబుల్ రావు బంజర్, యజ్ఞనారాయణపురం, లింగాల, చెన్నూరు, పెద్ద కోరుకొండి, వెన్నవల్లి, తాళ్లూరి వెంకటాపురం, పోచారం, చిన్న కోరుకొండి గ్రామాల్లో పర్యటించి గ్రామపంచాయతీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని చెప్పారు. స్థానిక నేతలు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.