నేటి నుంచి మూడో విడత నామినేషన్లు షురూ..!
KMM: జిల్లాలో నేటి నుంచి మూడో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇవాళ్టి నుంచి ఈ నెల 5 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 6న నామినేషన్ పత్రాలను పరిశీలించనున్నారు. ఈ నెల 9వ తేదీ వరకు నామినేషన్ ఉపసంహరణకు గడువు ఉండగా.. అదే రోజు అభ్యర్థుల తుది జాబితాను వెల్లడిస్తారు. డిసెంబర్ 17న ఓట్ల లెక్కింపు చేసి అదే రోజున విజేతలను ప్రకటిస్తారు.