శ్రీశైలం లాఠీఛార్జ్ ఘటనపై మాధవ్ ఆగ్రహం..!

శ్రీశైలం లాఠీఛార్జ్ ఘటనపై మాధవ్ ఆగ్రహం..!

NDL: మల్లన్న భక్తులపై నిన్న జరిగిన లాఠీఛార్జ్ ఘటనపై బీజేపీ చీఫ్ మాధవ్ తీవ్రంగా స్పందించారు. శివ మాలధారులపై అడిషనల్ ఎస్పీ లాఠీఛార్జ్ చేయడం అనేది అన్యాయం అని ఆరోపించారు. భక్తుల పట్ల అధికారులు సంయమనం పాటించాలని హితవు పలికారు. ఇరుముడులు సమర్పించేందుకు వచ్చిన భక్తులకు సహకరించాల్సిన యంత్రాంగం ఇలా వ్యవహరించడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.