అనంతవరంలో వైభవంగా శివాలయ ప్రతిష్ఠ

NTR: మైలవరం మండలం అనంతవరం గ్రామంలో కొలువైన శ్రీ పార్వతి దేవి సమేత శ్రీ అనంతేశ్వరస్వామి దేవాలయ (శివాలయం) ప్రతిష్ఠాపన కార్యక్రమం సోమవారం అంగరంగ వైభవంగా జరిగింది. వేదపండితుల శాస్త్రోక్త మంత్రోచ్ఛారణల నడుమ శివలింగం, ధ్వజస్తంభాలను ప్రతిష్ఠించారు. కార్యక్రమంలో మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.