జిల్లా అధికారులను సన్మానించిన కలెక్టర్

KRNL: కర్నూలు జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా గురువారం నిర్వహించిన కార్యక్రమంలో ఆర్‌డబ్ల్యూఎస్ ఇంజనీర్లు, ఎంపీడీఓలు, ఈఓఆర్డీలు తదితర సిబ్బందిని జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా సన్మానించారు. అనంతరం మాట్లాడుతూ.. గ్రామీణాభివృద్ధికి కృషిచేసే అధికారుల సేవలు ప్రశంసనీయమన్నారు.