ఓకే కుటుంబంలో ముగ్గురికి కానిస్టేబుల్ ఉద్యోగాలు

ఓకే కుటుంబంలో ముగ్గురికి కానిస్టేబుల్ ఉద్యోగాలు

ATP: గుత్తికి చెందిన ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ మహబూబ్‌దౌలాకు ముగ్గురు కుమారులు కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. మహమ్మద్ అలీ, మహమ్మద్ గౌస్, మహమ్మద్ సమీర్ కానిస్టేబుళ్లు ఫలితాలలో మంచి ఉత్తీర్ణత సాధించారు. ఒకే కుటుంబంలో, అదీ ముగ్గురు సోదరులకు ఉద్యోగాలు రావడంతో ఆ కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. ప్రస్తుతం వీరు అనంతపురంలో స్థిరపడ్డారు.