VIDEO: మిలాన్-2026 సముద్ర దశ ముగింపు
VSP: విశాఖ వేదికగా నిర్వహించిన అంతర్జాతీయ నౌకాదళ విన్యాసాలు ‘ఎక్సర్‌సైజ్ మిలాన్-2026’ సముద్ర దశ శుక్రవారం విజయవంతంగా ముగిసింది. స్వదేశీ విమాన వాహక నౌక ఐఎన్‌ఎస్ విక్రాంత్‌పై ముగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ విన్యాసాల్లో 42 యుద్ధనౌకలు, సబ్‌మరైన్లు, 29 విమానాలు పాల్గొని సముద్ర భద్రత సహకారం, నౌకాదళాల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేశాయి.