పైపుల దగ్ధంపై ఎస్పీ ఆరా

AP: అమరావతి పనుల పునఃప్రారంభోత్సవం జరుగుతుండగా అగ్నిప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. అయితే దీనిపై SP సతీశ్‌కుమార్ మాట్లాడారు. '2014-19 మధ్య L&T సంస్థ రాజధాని పనుల కోసం సిలికాన్ HDPE పైపులను నిల్వ చేసింది. ఇవి కాలిపోవడం వల్ల రూ.9 కోట్ల నష్టం వాటిల్లింది. ప్రమాదం ఉద్దేశపూర్వకంగా జరిగిందా, ప్రమాదవశాత్తు సంభవించిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నాం' అని చెప్పారు.