వాహనదారులకు పోలీసులు అవగాహన

వాహనదారులకు పోలీసులు అవగాహన

ELR: జీలుగుమిల్లి స్థానిక పోలీస్ స్టేషన్ వద్ద ఎస్సై క్రాంతి కుమార్ ద్విచక్ర వాహనదారుల భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మోటార్ సైకిల్ ప్రమాదాలను, వాటి వల్ల జరిగే ప్రాణనష్టాన్ని నివారించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ద్విచక్ర వాహనం నడిపే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్లను ధరించాలని కోరారు. హెల్మెట్ అనేది భారం కాదని మన ప్రాణాలను కాపాడేదన్నారు.