నేడు నెమలిగుండ్ల రంగనాయక స్వామి ఉత్సవ వేడుకలు

నేడు నెమలిగుండ్ల రంగనాయక స్వామి ఉత్సవ వేడుకలు

ప్రకాశం: రాచర్ల మండలంలోని జే.పీ చెరువు గ్రామంలో శ్రీ నెమలిగుండ్ల రంగనాయక స్వామి వారి 16వ రోజు పండుగ మహోత్సవం నేడు ఘనంగా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో వివిధ కార్యక్రమాలు నిర్వహించబడతాయి. ఉదయం బండ పందెం, క్రికెట్ పోటీలు, మధ్యాహ్నం అన్నదానం, సాయంత్రం కోలాటం, గ్రామోత్సవం, రాత్రి పాటకచేరి జరుగుతాయని నిర్వహకులు తెలిపారు. భక్తులు పాల్గొనాలని ఆలయ ఈవో తెలిపారు.