విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే పెద్దిరెడ్డి

CTC: పుంగనూరు నియోజకవర్గ పులిచెర్ల మండలంలో ఆదివారం ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన నియోజకవర్గానికి చెందిన పులిచెర్ల మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం ఆలయ ధర్మకర్త మురళీమోహన్ రెడ్డి ఎమ్మెల్యే దంపతులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు.