అక్రమ నిర్మాణాలను పరిశీలించిన అధికారులు

అక్రమ నిర్మాణాలను పరిశీలించిన అధికారులు

జమ్మికుంట: హౌసింగ్ బోర్డ్ కాలనీలో అక్రమ నిర్మాణాలను వరంగల్‌ హౌసింగ్ బోర్డ్ అధికారులు పరిశీలించారు. హౌసింగ్ బోర్డు- రైల్వే ట్రాక్ సమీపంలోని స్థలంలో మున్సిపల్ అధికారులు పెట్టించిన బోర్డును తొలగించారు. హౌసింగ్ బోర్డు,  కాలనీలోని పలు ప్రాంతాలు, రహదారి కబ్జాకు గురైనట్లు అధికారులు నిర్ధరించారు. నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తానని డిప్యూటీ ఈఈ రవి ప్రసాద్ తెలిపారు.