రేపు జిల్లాకు మాజీ మంత్రి హరీష్ రావు రాక
NLG: కొండమల్లేపల్లి పట్టణానికి మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ఆదివారం వస్తున్నట్లు బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రమావత్ దస్రునాయక్ తెలిపారు. ఉదయం 10.30 గంటలకు పట్టణంలోని పాల కేంద్రానికి చేరుకుంటారని తెలిపారు. మండల పరిధిలోని బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.