నగర అభివృద్ధి పనులపై కలెక్టర్ సమీక్ష
NZB: నగర అభివృద్ధి పనులపై జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి నిన్న మున్సిపల్ ఇంజినీరింగ్ విభాగం అధికారులతో సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. జోన్ల వారీగా మంజూరైన పనుల పురోగతి, నిధుల ఖర్చు వివరాలను ఆయన ఆరా తీశారు. సదుపాయాల పునరుద్ధరణపై ప్రస్తావించారు. అభివృద్ధి పనులను ఎట్టి పరిస్థితుల్లోనూ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.