బాధిత కుటుంబానికి LOC అందజేత
BHPL: మహాముత్తారం మండలం ములుగుపల్లి గ్రామానికి చెందిన విజయగిరి రవీంద్రచారి అనారోగ్యంతో హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం మంత్రి శ్రీధర్ బాబుకు తెలుపగా.. ఆయన వెంటనే స్పందించారు. మంత్రి CMRF పథకం నుంచి రూ.2 లక్షల ఆర్థిక సహాయాన్ని మంజూరు చేయించారు. ఇవాళ మంత్రి ఆసుపత్రి సహాయకుడు బాధిత కుటుంబానికి LOCను అందజేశారు.