అనుమానాస్పదస్థితిలో మహిళ మృతి

అనుమానాస్పదస్థితిలో మహిళ మృతి

KNR: శంకరపట్నం మండలం కొత్తగట్టులోని వ్యవసాయ బావిలో నిన్న మహిళ మృతదేహం లభ్యమైన విషయం తెలిసిందే. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని బయటకు తీసి గ్రామానికి చెందిన తీగల రాజేశ్వరిగా గుర్తించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి, హత్యా? ఆత్మహత్యా? అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు.