బాధితులను పరామర్శించిన డీసీసీ అధ్యక్షుడు
NRML: లక్ష్మణ చందా మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ నాయకులు సమ్మెట రవి తండ్రి ఇటీవలే అనారోగ్యంతో నిర్మల్‌లోని ఆసుపత్రిలో చేరారు. ఈ విషయం తెలుసుకున్న డీసీసీ అధ్యక్షుడు కూచాడి శ్రీహరి రావు శనివారం పరామర్శించారు. అనారోగ్యానికి గల కారణాలు తెలుసుకున్నారు. ఆయనకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. వారితోపాటు మండల కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.